CTR: రేపు జిల్లా కలెక్టరేట్లో ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దివ్యాంగుల సహాయ సంచాలకులు విక్రమ కుమార్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కలెక్టరేట్లోని బీసీ భవన్లో కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలిపారు.