W.G: తుఫాను కారణంగా రైతులు తమ ధాన్యం తడిచిపోకుండా భద్రపరచుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 11 వేలు బరకాలు సిద్ధంగా ఉంచినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం భీమవరంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణ కేంద్రాలు, సహకార సంఘాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటివరకు రైతులు 2,750 బరకాలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు.