BDK: ఆయిల్ ఫామ్ రైతులకు ఊరటనిస్తూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కీలక ప్రకటన చేసింది. ఈ ధర పెంపుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అక్టోబర్ నెలలో రూ. 19,681 ఉన్న టన్ను గెలల ధరను నవంబర్ నెలకు గాను ఏకంగా రూ. 825 పెంచింది. తాజా పెంపుతో నవంబర్ నెల ఆయిల్‌పామ్ టన్ను గెలల ధర రూ. 20,506గా తెలంగాణ ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది.