వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాలు పరిష్కారంలో చొరవ చూపాలన్నారు.