KRNL: గోనెగండ్ల మండలం పెద్దనెలతూరు గ్రామానికి చెందిన చకళి పార్వతికి రూ.1.82 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ అందజేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు మేలు చేయడంలో తారతమ్య బేధాలు చూడబోమని స్పష్టం చేశారు.