SRPT: అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, అనంతగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని ఇవాళ రాత్రి కలెక్టర్ తేజస్ నందా లాల్ పవర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు.