ప్రకాశం: కొండేపి, మార్కాపురం, వై.పాలెం నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై IVRS సర్వేలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని వారంలో 3 రోజులు అధికారులు ప్రజల్లో ఉండాలని సూచించారు.