JGL: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ కొండగట్టులో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20,000ల నగదును తహసీల్దార్ వసంత ఇవాళ అందజేశారు. ఆమె వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి ఉన్నారు.