కర్నూలు నగరాభివృద్ధికి పన్నులే ప్రధాన వనరని కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. రెవెన్యూ సమీక్షలో మాట్లాడుతూ.. నగరంలో రూ.93 కోట్లు ఆస్తి పన్నులు, రూ.14.78 కోట్లు తాగునీటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. మొండి బకాయిదారులపై అలసత్వం వద్దని, వెంటనే నోటీసులు ఇవ్వాలని, ఇప్పటికే ఇచ్చిన చోట దుకాణాలు సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.