E.G: నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధనుంజయ్, శ్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, సెప్టెంబర్ నెలలో బ్రేక్ డౌన్ లేకుండా బస్సులు నడిపినందుకు ఉత్తమ సేవలందించినందుకు ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళవారం సాయంత్రం తూ. గో జిల్లా రాజమహేంద్రవరంలో DPTO వై.ఎస్.ఎన్. మూర్తి ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.