KMM: మధిర మండలంలోని ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన భూక్య నవీన్ ఇవాళ తన నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారు. స్థానిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో వార్డులో పోటీ చిత్రం మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, స్వతహాగా తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు.