WGL: రాయపర్తి మండలం మైలారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇవాళ తేనెటీగలు దాడి చేయడంతో మహిళా రైతు పెరటి దేవేంద్రతో పాటు మరో కొందరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అంబులెన్స్‌లో బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రంలో భయం పడిన రైతులు కొంతసేపు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.