SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. స్థానిక మండల పరిషత్లో రెండు కౌంటర్లు, పక్కనే ఉన్న రైతు వేదిక కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో శారద అదనపు కలెక్టర్కు చెప్పారు. నామినేషన్ హాల్లో అభ్యర్థితో పాటు ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు.