ADB: నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 సెప్టెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్స్‌లో జిల్లాలోని నార్నూర్ మండలం దేశవ్యాప్తంగా ఉన్న 500 బ్లాక్‌లలో 4వ స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. దక్షిణ భారతంలోని జోన్-3లో 1వ ర్యాంక్ సాధించిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఈ మండలానికి రూ.1.5 కోట్లు పురస్కారం లభించిందని తెలిపారు.