కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువత సోషల్ మీడియాలో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని వ్యాఖ్యానించాడు. ముందుగా యూత్ తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని తెలిపాడు. అవసరం మేరకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలని చెప్పాడు. అలాగే, ‘నన్ను కాదు, మీ తల్లిదండ్రులను ఆరాధించండి’ అని తన అభిమానులకు సూచించాడు.