NRML: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీహరి రావు నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.