SRD: కంగ్టి మండలంలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్సై దుర్గారెడ్డి అభ్యర్థులకు ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ సెంటర్ వద్ద 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని, అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.