GNTR: గత ఐదేళ్ల పాటు కుదేలైన సాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో పయనింప చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పారు. 17 నెలల కాలంలోనే సాగునీటి రంగాన్ని ప్రగతి పథంలో నిలబెట్టామన్నారు.