కడప: వైసీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ తవ్వా వెంకటయ్య, ఆచార్య మూల మల్లికార్జున రెడ్డితో కలిసి మంగళవారం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిని సన్మానించారు. శెట్టిపల్లె మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధత గల కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందన్నారు. జగన్ చరిత్రపై పుస్తకం రాసిన వెంకటయ్య సేవలను కొనియాడారు.