MBNR: తెలంగాణ భవన్లో అఖిల భారత అవయవ దాతల సంఘం-సావిత్రిబాయి పూలే ట్రస్ట్ నిర్వహించిన అవయవ దానం అవగాహన పోస్టర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఛైర్పర్సన్ డా. గూడూరు సీతామహాలక్ష్మిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జోగు రామన్న, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.