NZB: సాలూర మండల కేంద్రంలోని శివారులో ఆటో టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. సాలూర నుంచి బోధన్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.