E.G: జీవీపీల (గ్రోత్ వెల్ఫేర్ పాయింట్స్) తొలగింపులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. GVPల తొలగింపు, IVRS సర్వే సహా పలు అంశాలపై ఆయన చర్చించారు. జీవీపీలను 100 శాతం తొలగించాలని ఆదేశించి నెలరోజులైనా పురోగతి లేదని అన్నారు.