NLR: మర్రిపాడు మండల కేంద్రంలోని సచివాలయంలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు విషయాలపై కీలక సూచనలు చేశారు. సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచించారు. తగిన మోతాదులోనే పొలాలకు ఎరువులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కవిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.