ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కోర్సులు ఏవైనప్పటికీ ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పట్ల తప్పక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మనము ఏ ఉద్యోగం పొందాలన్నా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు.