KNR: స్థానిక సంస్థల కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే కేజీబీవీ తిమ్మాపూర్, కేజీబీవీ గన్నేరువరం పాఠశాలలను సందర్శించి, స్నేహిత 2 అవగాహన కార్యక్రమంలో భాగంగా బాలికలకు గ్రీవెన్స్ బాక్స్ గురించి అవగాహన కల్పించారు.