MDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు- 2025పై క్షేత్రస్థాయిలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన అభిప్రాయ సేకరణ నిర్వహించారు. వ్యవసాయ శాఖ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు విత్తన ఉత్పత్తిదారులు, డీలర్లు, రైతులకు అవగాహన కల్పించారు.