TG: ముఖ్యమంత్రి పదవి తన దగ్గర ఉన్నా.. ముఖ్యమైన శాఖలన్నీ ఖమ్మం జిల్లా వాళ్ల దగ్గరే ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తలుచుకుంటే.. కానీ పని లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని పేర్కొన్నారు. ఏ పథకమైనా ఇక్కడి నుంచే ప్రారంభించామని ఉద్ఘాటించారు.