కర్నూలు నగరంలోని స్థానిక జీజీహెచ్ అరుదైన స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 203 మంది బాధితుల నుంచి సేకరించిన నమూనాలను మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షించగా.. 38 మందికి పాజిటివ్ అని సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. వీరందరికీ జనరల్ మెడిసిన్ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.