NLR: సంగం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఆధ్వర్యంలో సంగంలోని ప్రైవేట్ స్కూల్ వ్యాన్లను మంగళవారం సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఫిట్నెస్, భద్రతా నిబంధనల అమలుపై దృష్టి సారించారు. బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అత్యవసర ద్వారం పనితీరు పరిశీలించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని యాజమాన్యాలకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు.