TG: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ.. దేశానికి తలమానికంగా మారబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వర్సిటీని ఖమ్మంకు తీసుకువచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.