W.G: షణ్ముఖి ఆంజనేయరాజు 97వ జయంతి పురస్కరించుకొని మంగళవారం తణుకులో కళా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ రంగస్థల నటులు విజయ షణ్ముఖి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది షణ్ముఖి పురస్కారాన్ని తుర్లపాటి రాధాకృష్ణమూర్తికి అందజేశారు.