NLG: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటని కలెక్టర్ సూపరింటిండెంట్ను ప్రశ్నించారు. అలాగే వార్డులో ఉన్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని చెప్పారు. ప్రసూతి వార్డు ,చిన్నపిల్లల వార్డు, ఐసీయూ తదితర వార్డులలో తనిఖీలు నిర్వహించారు.