MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో సృజన మంగళవారం సందర్శించారు. ఆశా వర్కర్ల సమావేశంలో పాల్గొని మధుమేహం, అధిక రక్తపోటుకు సంబంధించిన ట్యాబ్లెట్లను ప్రజలకు అందించాలని సూచించారు. అదేవిధంగా ఎయిడ్స్‌కు సంబంధించిన అవగాహనను ఆశా వర్కర్లకు కల్పించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఫర్నాజ్, సీహెచ్ రాణి పాల్గొన్నారు.