KNR: ప్రజాసేవ, పరిపాలన, వినూత్న కార్యక్రమాల రూపకల్పనలో చేసిన విశిష్ట కృషికి గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.