MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేగుంట మండలం మక్కరాజుపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై బ్యాగులో తరలిస్తున్న 30 లక్షల 59,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గజ్వేల్ మండలం ధర్మారం గ్రామంకు చెందిన దంపతులుగా గుర్తించారు.