WGL: ఉమ్మడి WGL జిల్లాకు చెందిన 6 జిల్లాల అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక కోసం ఈ నెల 4న వంగాలపల్లి డబ్ల్యూడీసీఏ క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు ట్రయల్స్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూడీసీఏ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ పోటీల ద్వారా జిల్లా జట్టును ఎంపిక చేస్తామని, అర్హులైన క్రీడాకారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు.