ATP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం కష్టాలు పడుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. 18 నెలలైనా ఏ పంటకూ మద్దతు ధర కల్పించలేదని, జిల్లాలో లక్ష ఎకరాలు బీడుగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు పాలనలో దళారులే లాభపడుతున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలు తీర్చకుంటే రోడ్లను దిగ్బంధనం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.