ఉల్లిపాయ పైపొరలపై నలుపు రంగులో ఫంగస్ చేరినవి చూస్తుంటాం. వాతావరణ మార్పులు, నేలలో ఉండే తేమ, రవాణా చేసే సమయంలో, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఈ మరకలు ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఇలాంటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తరచూ తినడం వల్ల కిడ్నీ, కాలేయానికి హాని కలుగుతుంది. నలుపు రంగులో ఉన్న ఉల్లిపాయల పొరలను పూర్తిగా తీసేయాలి. శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి.