PPM: సాలూరులో టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని తెలుసుకోవాలని కోరారు. అలాగే ప్రజలు సమస్యలను పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని కోరారు.