NLG: నల్గొండలోని శివాజీ నగర్లో విద్యుత్ అధికారులు ఇవాళ బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఎర్త్ గుంటలను చెక్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్ రావు, ఏడీఈ వేణుగోపాలచార్యులు తదితరులు పాల్గొన్నారు.