గవర్నర్ల అధికారిక నివాసమైన రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఒడిశా, త్రిపుర, బెంగాల్, అసోం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాకు లోక్‌భవన్‌గా మార్చారు. అయితే కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.