MNCL: ప్రజలు ఒత్తిడికి దూరంగా ఉండాలని జాతీయ మానసిక ఆరోగ్యం సర్వే ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కులకర్ని సూచించారు. ప్రజల మానసిక ఆరోగ్య స్థితి, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడానికి జన్నారం మండలంలోని రోటి గూడ, మల్యాల గ్రామాలలో సర్వే నిర్వహించి ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.