GNTR: తెనాలి పట్టణంలో మంగళవారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వన్‌టౌన్, టూటౌన్ స్టేషన్ల పరిధిలో సీఐ మల్లికార్జున,రాములు నాయక్ సిబ్బందితో కలిసి వంతెనలు, ప్రధాన మార్గాల్లో ఆటోలను తనిఖీ చేశారు. అధిక సౌండ్ బాక్స్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ఆటోలపై కేసులు నమోదు చేసి సౌండ్ బాక్స్‌లను సీజ్ చేసి స్టేషన్లకు తరలించారు.