ADB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోథ్ మండలంలో రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇవాళ బోథ్ ఎంపీడీవో ఎలక్షన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. RO, AROలకు నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన దశల వారిగా చేపట్టే ప్రక్రియలను వివరించారు. క్లస్టర్ వారీగా సామగ్రిని సంబంధిత ROలకు అందజేశారు. ఇందులో ఎంపీవో రాజ్ కుమార్ ఇతర అధికారులున్నారు.