TG: పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబుతో సహా.. తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల తుఫాన్ వచ్చినప్పుడు తెలంగాణ మునిగినా.. ఎక్కడా ఏపీ ప్రజలను నిందించలేదని గుర్తుచేశారు.