కృష్ణా: బందరు ట్రాఫిక్ ఎస్సై నున్న రాజు జాతీయ రహదారి–216లోని హర్ష కాలేజ్ సమీపంలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ఆపి, మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేశారు.