TG: KCR చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని CM రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వంలో సంక్షోభమే తప్ప.. అభివృద్ధి లేదన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది రెండింటినీ చేస్తోందని చెప్పారు. రెండేళ్లలో 4 ఎయిర్ పోర్టులకు పర్మిషన్ తెచ్చుకున్నామన్నారు. ఈ నెలలోనే వరంగల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. KCR పాలనకు, తమ పాలనకు మధ్య చర్చ జరగాలన్నారు.