KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన కుక్కల యాకోబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న MRPS నాయకులు వెంకన్న మాదిగ, కట్టెకోల వెంకటేశ్వర్లు యాకోబు భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.