WGL: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఇవాళ వరంగల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్, భారీ డిస్కౌంట్స్ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఉచితం అనగానే ఆశపడకుండా ఒక్క క్షణం ఆలోచించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.