TG: ఉస్మానియా అభివృద్ధికి ఎంత ఖర్చయినా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9న తెలంగాణ-2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని, రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచ దిగ్గజ నేతల సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. కోర్ అర్బన్ క్యూర్ చేయాలని నిర్ణయించామని, ఈనెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని వెల్లడించారు.